Adinarayana : తెలంగాణలో తొలి ఫలితం… అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణ విజయం

బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.

Adinarayana Jare

Congress Candidate Adinarayana Won : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో తొలి ఫలితం వెలువడింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.

కాంగ్రెస్ రెండో విజయం
ఇల్లందులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఖాతాలో రెండో విజయం నమోదు అయింది. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు.

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ఇంటివద్ద సంబరాలు

కాంగ్రెస్ మూడో విజయం
కాంగ్రెస్ మూడో విజయం సాధించింది. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 6,235 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Adinarayana : తెలంగాణలో తొలి ఫలితం… అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణ విజయం

వరంగల్ పశ్చిమ 3 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి 2399 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్ తూర్పులో 3రౌండ్లు ముగిసే సరికి 6271 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజలో ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు