Khammam District Political Scenario
గత ఎన్నికల్లో అంతా కారు జోరు సాగినా ఖమ్మంలో స్పీడ్ బ్రేకర్లను కారు అధిగమించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది గులాబీదళం. ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు కామ్రేడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఖమ్మంలో ఈసారి కూడా కారు పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ తో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోరు ఆసక్తికరంగా మారింది.
నిన్నటివరకు ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు హోరాహోరిగా తలపడుతున్నారు. ఇక పాలేరులో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రంగంలోకి దిగడంతో నల్లేరుపై నడకగా సాగుతుంది అనుకున్న పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంటి మీదు కునుకు లేకుండా పోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రెడ్ సిగ్నల్ ఇస్తుంటే మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మాత్రం హస్తంతో పొత్తు కుదుర్చుకుని కొత్తగూడెం బరిలోకి దిగింది.
Also Read : తెలంగాణ పోరులో వారసులు విజయం సాధిస్తారా? హోంశాఖ మంత్రుల వారసులకు దక్కని అవకాశం
ఈ స్థానంలో బీఆర్ఎస్, సీపీఐ మధ్య పోటీ జరుగుతుండగా బీఆర్ఎస్ రెబల్ గా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ సింహం గుర్తుతో గర్జిస్తున్నారు. ఇక మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేన కూడా బరిలోకి దిగటంతో ఇక్కడ కొత్త దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సత్తుపల్లి నుంచి సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వంటి ప్రముఖ నేతలు పోటీ పడుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎవరి బలాబలాలు ఏంటి? మొత్తం 10 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన 30మంది ప్రధాన నేతల బలాబలాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..