Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు

పొత్తులపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పారు. గెలుపు అవకాశాలు ఉండి, పార్టీకి విధేయులుగా ఉన్న వారిని అభ్యర్థులుగా..

Muraleedharan

K Muraleedharan: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ఆ పార్టీ ముహూర్తం ఖరారు చేసింది. తొలి విడతలో ఆదివారం 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.

ఈ మేరకు కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ ప్రకటన చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిశీలనకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

కాంగ్రెస్ అధిష్టానం మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తుందని మురళీధరన్ చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయని వివరించారు. పొత్తులపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పారు.

గెలుపు అవకాశాలు ఉండి, పార్టీకి విధేయులుగా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం తమ అంతర్గత విషయమని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. కాగా, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఇప్పటికే కాంగ్రెస్ చెప్పింది. మైనారిటీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.

Bandi Sanjay: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఇక లేఖలు సృష్టిస్తారు: బండి సంజయ్

ట్రెండింగ్ వార్తలు