Bandi Sanjay: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఇక లేఖలు సృష్టిస్తారు: బండి సంజయ్

పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ప్రవళిక కుటుంబం కుమిలిపోతోందని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఇక లేఖలు సృష్టిస్తారు: బండి సంజయ్

Bandi Sanjay

Updated On : October 14, 2023 / 7:04 PM IST

Pravalika Case: హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవళిక అనే యువతి ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిందని, పరీక్షలు వాయిదాపడుతున్నాయని బాధపడిందని బండి సంజయ్ అన్నారు. తల్లిదండ్రులు తన కోసం ఎంతో కష్టపడ్డారని ప్రవళిక ఫోన్‌లో చెప్పిందని తెలిపారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఓటేసి మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని విమర్శించారు.

ప్రవళిక కుటుంబంలో మనోధైర్యం నింపకుండా ఆ యువతిది ప్రేమ విఫలం అని చెబుతున్నారని బండి సంజయ్ చెప్పారు. పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ప్రవళిక కుటుంబం కుమిలిపోతోందని అన్నారు. ప్రేమ విఫలం వల్లే చనిపోయిందని నకిలీ లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరని ఆరోపించారు.

నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. కోచింగ్ సెంటర్లు మొత్తం బంద్ చేసి నిరుద్యోగులు గ్రామాలకు వెళ్లాలని, వచ్చే 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారని అన్నారు. నవంబర్ 30 కేసీఆర్‌కు డెడ్ లైన్ కావాలని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, కర్ణాటకలో రూ.40 కోట్లు దొరికాయని అన్నారు.

Governor Tamilisai : ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశం