Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త

జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రాహుల్‌, సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుంటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

Jagityala

Jagityala : ఆడపిల్ల పుడితే భారంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. అమ్మాయి పుట్టిందని అనగానే.. బాధ పడుతుంటారు. మరికొంతమంది ఆడపిల్లతో ఇంటికి వచ్చిన కోడల్ని మానసికంగా.. శారీరకంగా వేధిస్తుంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని.. సంతోషం కంటే.. ఎక్కువగా బాధ పడుతుంటారు. అరిష్టమని భావిస్తుంటారు. కానీ ఆడపిల్లను భారంగా భావించే సమాజంలో క్రమంగా మార్పు వస్తోంది.

కొంతమంది తమింట్లో మహలక్ష్మి పుట్టిందని భావించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించే వారు ఉన్నారు. ఆడపిల్ల ఇంటికి అందమని, కొంగుబంగారమని భావించి అపురూపంగా చూసుకేనే వారు లేకపోలేదు. శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపంగా భావించి పువ్వుల్లో పెట్టి పూజించే వారూ ఉన్నారు. పుట్టిన ఆడపిల్లతో అత్తంటికి వచ్చిన ఓ కొడలికి జగిత్యాలలో అత్తింటివారు ఘనస్వాగతం పలికారు.

Bhopal : ఆడపిల్ల పుట్టిందని పానీపూరి వ్యాపారి ఏం చేశాడో తెలుసా ? మెచ్చుకుంటారు

జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రాహుల్‌, సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుంటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్‌పల్లిలో 21వ రోజు పండుగ జరుపుకుని.. జగిత్యాల తీసుకొచ్చారు. పాపను తీసుకుని ఇంటికి వచ్చిన కోడలు సుప్రియను అత్తింటివారు పూలపై నడిపించారు. ఇల్లంతా అందంగా అలంకరించి వేడుక నిర్వహించారు. హారతులిచ్చి ఆహ్వానం పలికారు. అష్టలక్ష్మి పూజ చేసి.. ఆడపిల్లకు శ్రీమహాలక్ష్మిగా పేరుపెట్టి సంబరాలు చేసుకున్నారు.