Bhopal : ఆడపిల్ల పుట్టిందని పానీపూరి వ్యాపారి ఏం చేశాడో తెలుసా ? మెచ్చుకుంటారు

పానీపూరి వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరిపారు. స్థోమత లేకున్నా..తాహతుకు మించి ఖర్చు చేశాడు.

Bhopal : ఆడపిల్ల పుట్టిందని పానీపూరి వ్యాపారి ఏం చేశాడో తెలుసా ? మెచ్చుకుంటారు

Panipuri

Pani Puri Wala Celebrates : ఆడపిల్ల పుడితే…చీత్కరించే ఈ రోజుల్లో..కొంతమంది ఎంతో సంతోష పడుతుంటారు. అంతేకాదు..ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకుంటుంటారు. కోడలికి ఘనంగా స్వాగతించడం…ఇతరత్రా వాటిని చూసే ఉంటాం. తాజాగా..పానీపూరి వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరిపారు. స్థోమత లేకున్నా..తాహతుకు మించి ఖర్చు చేశాడు. హంగు..ఆర్భాటాలు ఏం చేయలేదు. అతను చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. ఇలాంటి తండ్రి సమాజానికి అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.

Read More : Pregnant Woman Suicide : వివాహిత మహిళ ఆత్మహత్య

ఇంతకు ఏం చేశారు ?
కొలార్ పట్టణంలో అంచల్ గుప్తా అనే వ్యక్తి పానీపూరి అమ్ముకుంటూ..జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు 17న అంచల్ సతీమణి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అంచల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో సంబరపడిపోయాడు. ఈ సంతోషాన్ని ఎలాగైనా వ్యక్తపరచాలని అనుకున్నాడు. కోలార్ పట్టణంలో రూ. 50 వేలు ఖర్చు చేసి అందరికీ ఉఛితంగా పానీపూరి అందించాడు. తనకు ఆడపిల్ల పుట్టిందని..అందుకు ఫ్రీగా పానీపూరి అందచేస్తున్నట్లు వెల్లడించారు. ఇతని పనిని అందరూ మెచ్చుకున్నారు.

Read More : Dalitha Bandhu : 2, 3 వారాల్లోనే కుటుంబానికి రూ.10లక్షలు.. కొత్త మరో 4 మండలాల్లో

తాను వివాహం చేసుకున్న అనంతరం ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నానని, కానీ…రెండేళ్ల క్రితం మొదటి సంతానంలో కొడుకు జన్మించాడని అంచల్ గుప్తా తెలిపారు. ఆగస్టు 17వ తేదీన కూతురు జన్మించిందని..దీనికి ఎంతో సంతోషపడ్డానన్నారు. అంతేగాకుండా..పాప జన్మించని రోజునే..తన కొడుకు రెండో పుట్టిన రోజు కావడం విశేషమన్నారు. అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్ ఉంటుందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకుని…చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి…ఉచితంగా పానీపూరి పంపిణీ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఆడపిల్లలు, మగ పిల్లలు ఇరువురూ సమానేమనని…వివక్షకు తావులేదని కుండబద్ధలు కొట్టారు. ఇతను చేసిన ఈ ప్రయత్నం చాలా మందిని ఆకర్షించింది. చాలా మంది అభినందించారు.