Dalitha Bandhu : 2, 3 వారాల్లోనే కుటుంబానికి రూ.10లక్షలు.. కొత్తగా మరో 4 మండలాల్లో

దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం

Dalitha Bandhu : 2, 3 వారాల్లోనే కుటుంబానికి రూ.10లక్షలు.. కొత్తగా మరో 4 మండలాల్లో

Dalitha Bandhu

Dalitha Bandhu : దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి అనుభవాలను కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ సీఎంకి వివరించారు. అసెంబ్లీ సాక్షిగా దళిత బంధు పథకం రూపకల్పన జరిగిందని కేసీఆర్‌ అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2, 3 వారాల్లోనే దశలవారీగా చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లోని ఎస్సీ కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు. దేశంలో ఎవరూ చేయని వినూత్న ఆలోచన దళితబంధు అని చెప్పారు.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

మరో 4 మండలాల్లో దళిత బంధు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తరాన ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణాన ఉన్న అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని తెలిపారు. రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని, ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

ఎస్సీలను ఆర్థికంగా, వ్యాపార వర్గంగా నిలబెట్టాలని సంకల్పించినట్లు కేసీఆర్‌ వివరించారు. ఎస్సీ సాధికారత కింద అసెంబ్లీలో వెయ్య కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చానన్నారు. కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దళిత బంధు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళిత బంధుకు బడ్జెట్‌లో సైతం నిధులు కేటాయిస్తామన్నారు.

దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశానికి పలువురు నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాలుగు మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరుకావడం.. అందులోనూ ఆయన సీఎం కేసీఆర్ పక్కన కూర్చోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.