×
Ad

చలాన్ పడితే అకౌంట్లో డబ్బులు కట్.. ప్రాసెస్ స్టార్ట్ అయిందా? మీరూ దీన్ని గమనించారా?

బ్యాంకు అకౌంట్‌ వివరాలను చిరునామా ప్రూఫ్‌ కోసమే తీసుకుంటున్నామని అధికార వర్గాలు అంటున్నాయి.

traffic violation challan

  • వాహనాలు అమ్మే షోరూమ్‌ల వద్దే వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు
  • వాహన యజమాని బ్యాంకు ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ కూడా ఇవ్వాలి
  • చలాన్లు కట్‌ అవడానికి కాదని ప్రభుత్వ వర్గాల క్లారిటీ

Automatic Traffic Fine Collection: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలను నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌ నుంచి కట్‌ చేసుకునే విధానం ఉండాలంటూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వాహనాలు అమ్మే షోరూమ్‌ల వద్దే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు అధికారులు ఓ కొత్త నిబంధన తీసుకొచ్చారు. వాహనం కొన్న వ్యక్తి బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ వివరాలను సైతం తీసుకుంటున్నారు.

ఒకవేళ ఆన్‌లైన్‌లో ఈ వివరాలను అప్‌డేట్‌ చేయకపోతే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు అప్‌లోడ్‌ కావట్లేదు. బ్యాంకు అకౌంట్‌ వివరాలు కూడా కావాలని ఆయా షోరూముల ముందు బోర్డులు పెడుతుండడం గమనార్హం.

Also Read: ఉచితాలు ఎత్తేస్తారా? లేక మార్చేస్తారా? ఆర్థిక సర్వేలో కేంద్రం ఏం చెప్పింది?

దీంతో వాహనదారులు భయపడుతున్నారు. చలానాలు పడగానే బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అయి పోతాయా? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాంకు అకౌంట్‌ వివరాలను చిరునామా ప్రూఫ్‌ కోసమే తీసుకుంటున్నామని అధికార వర్గాలు అంటున్నాయి.

రవాణాశాఖ కార్యాలయం, వాహనదారుల ఆర్సీ కార్డులపై ఆయా పాత చిరునామాలే ఉంటున్నాయని, దీంతో వాహనదారులు ఇళ్లు మారితే కొత్త అడ్రస్ నమోదు చేసుకోవడం లేదని చెబుతున్నాయి. యాక్సిడెంట్స్‌ జరిగినా, ఇతర అవసరమైన వేళల్లో వాహనాల యజమానులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. అందుకే బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకుంటున్నట్లు చెబుతున్నాయి. బ్యాంకులోనైతే కస్టమర్లు అడ్రస్‌ను అప్‌డేట్‌ చేసుకుంటారు.