Bandi Bhagirath Bail: పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్.
బండి భగీరథ(Bandi Bhagirath Bail)కు కోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది.
- V Santhosh Kumar
- Updated on- June 20, 2026 / 02:14 PM IST
Bandi bhagirath gets interim bail in pocso case
- బండి భగీరథకు తాత్కాలిక బెయిల్.
- మల్కాజ్‌గిరి కోర్టు కీలక ఆదేశాలు.
- జూన్ ఇరవైఆరు వరకు ఉపశమనం.
Bandi Bhagirath Bail: బండి భగీరథకు(Bandi Bhagirath Bail) కోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. పోక్సో (POCSO) కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు మల్కాజ్‌గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ (Interim Bail) మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెయిల్ జూన్ 26 వరకు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్న భగీరథకు ఈ తాత్కాలిక బెయిల్ లభించడంతో ఆయన జైలు నుండి బయటకు రానున్నారు. అయితే, కోర్టు విధించిన నిబంధనలను ఆయన ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ఇటీవల నమోదైన వివాదాస్పద పోక్సో కేసులో భగీరథను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర బెయిల్ పిటిషన్‌ను విచారించిన మల్కాజ్‌గిరి కోర్టు, జూన్ 26 వరకు ఈ తాత్కాలిక ఉపశమనాన్ని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
