Bandi Sanjay
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ఉద్యమకారులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో తమ పార్టీ పాత్ర చాలా కీలకమని చెప్పారు.
అప్పట్లో ఆత్మహత్యలు ఆపేలా సుష్మాస్వరాజ్ తెలంగాణ ప్రజల్లో భరోసా నింపారని అన్నారు. బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పడిందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు బీజేపీని కొనియాడారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమానికి బీజేపీ నేతలను రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
సోనియాగాంధీని ఆహ్వానించిన రేవంత్ తెలంగాణ బలిదేవత సోనియాగాంధీ అని టీడీలో ఉన్నపుడు అన్నారని చెప్పారు. 1,400 మంది బలికావడానికి కారణం కాంగ్రెస్ అని రేవంత్ అన్నారని తెలిపారు. బిల్లు ఆమోదంలో కీలకంగా ఉన్న బీజేపీ నేతలను కాంగ్రెస్ ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు.
తెలంగాణ లో ప్రజల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్ అని చెప్పారు. అప్పట్లో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ పాలన పంథానే కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని విమర్శించారు. ఉద్యమ కారులను గుర్తించడం లేదని చెప్పారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలపై విచారణ చేపట్టడం లేదని అన్నారు.
Also Read: సోనియా గురించి ఈ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారు: మంత్రి కోమటిరెడ్డి