సోనియా గురించి ఈ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారు: మంత్రి కోమటిరెడ్డి
komatireddy venkat reddy: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు.

Minister Komatireddy Venkat Reddy
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ నిండు సభలో చెప్పారని అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. వస్తారా.. రారా.. అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అన్ని పథకాల్లో స్కాంలు జరిగాయని తెలిపారు. తాము తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని అన్నారు. కాంగ్రెస్ వేవ్‌తో తమ నేతలు గెలుస్తారని తెలిపారు.
తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ సర్కారే ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉండదని తెలిపారు. ఆగస్టు 15లోపు తెలంగాణలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని అన్నారు. రాష్ట్రీ గీతంపై మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి ఆందోళనలు చేస్తున్నారుని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ రావులే ఉన్నారని అన్నారు.
Also Read: మద్యం షాపులు బంద్.. తెలంగాణలో ఓట్ల కౌంటింగ్‌పై పూర్తి వివరాలు తెలిపిన సీఈవో వికాస్ రాజ్