మద్యం షాపులు బంద్.. తెలంగాణలో ఓట్ల కౌంటింగ్‌పై పూర్తి వివరాలు తెలిపిన సీఈవో వికాస్ రాజ్
Vikas Raj : సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీలో ఐదు పోలింగ్ కేంద్రాలలో ర్యాండంగా వీవీ ప్యాట్స్ తీసుకుంటామని తెలిపారు.

Vikas Raj
తెలంగాణలో మే 4న జరిగే ఓట్ల కౌంటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వివరాలు తెలిపారు. కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ ఉంటాయని చెప్పారు. తెలంగాణలో మొత్తం 34 కేంద్రాలలో కౌంటింగ్ జరుగుతుందని అందుకోసం120 కౌంటింగ్ హాళ్లు ఎర్పాటు చేశామని అన్నారు.
సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీలో ఐదు పోలింగ్ కేంద్రాలలో ర్యాండంగా వీవీ ప్యాట్స్ తీసుకుంటామని తెలిపారు. మొత్తం 15,000 వేల మంది కౌంటింగ్ స్టాఫ్ పనిచేస్తారని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను అభ్యర్థులు ఇవాళ సాయంత్రం ఈసీకి ఇవ్వాలని అన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని వివరించారు.
ప్రతి కౌంటింగ్ కేంద్రానికి మూడు అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలతో పూర్తి పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు 2,18,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని తెలిపారు. 276 టేబుల్స్‌ను పోస్టల్ లెక్కింపు కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కౌంటింగ్ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని అన్నారు. కానీ స్థానిక పరిస్థితుల అనుగుణంగా ర్యాలీలకు పోలీస్ అనుమతి ఇస్తే చేసుకోవచ్చని తెలిపారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదలకు అనుమతి ఉందని చెప్పారు.
Also Read: అనారోగ్య కారణాలతో అవతరణ దినోత్సవానికి సోనియా రాలేకపోతున్నారు : వీహెచ్