అనారోగ్య కారణాలతో అవతరణ దినోత్సవానికి సోనియా రాలేకపోతున్నారు : వీహెచ్

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.

అనారోగ్య కారణాలతో అవతరణ దినోత్సవానికి సోనియా రాలేకపోతున్నారు : వీహెచ్

V Hanumantha Rao

Updated On : June 1, 2024 / 2:15 PM IST

V Hanumantha Rao : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనిగాంధీ హాజరుకాలేక పోతున్నారని వి. హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1969 ఉద్యమం కొత్తగూడెం ఖమ్మంలో పవార్ ప్లాంట్ లో ప్రారంభమైందని, ఆ ఉద్యమంలో అనేకమంది పాల్గొన్నారని తెలిపారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సోనియా గాంధీకి 42మంది ఎమ్మెల్యేల సంతకాలతో వినతి పత్రం అందజేసి.. ఆంధ్ర పెద్దతనంలో ఉండలేం అని చెప్పామని వీహెచ్ గుర్తు చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు ఆంధ్ర ఎంపీలు అడ్డుపడుతునప్పటికీ గట్టిగా పోరాడామని అన్నారు.

Also Read : దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించింది.. తప్పక అమలు చేస్తామని వీ హన్మంతరావు అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కళారూపాలు, వంటకాలు ఉత్సవాలలో పెట్టాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. పేదలకు ఎక్కువగా ఉపయోగపడే పది రూపాయల నోట్లు కూడా మార్కెట్ లో కనిపించడం లేదు. దానం చేద్దాం అన్న.. పది రూపాయల నోట్లు లేవు.

Also Read : వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మోడీ ప్రధాని అయ్యి ఆదాని, అంబానీలకే మేలు చేశారంటూ వి. హన్మంతరావు విమర్శించారు.