ఆ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు? మళ్లీ కులగణన పేరుతో హడావుడి ఎందుకు?: బండి సంజయ్

కులగణనకి తామేం వ్యతిరేకం కాదని, కానీ పారదర్శకంగా అది జరగాలని అన్నారు.

Bandi Sanjay Kumar

తెలంగాణలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు.

ఇప్పుడు మళ్లీ కులగణన పేరుతో హడావుడి ఎందుకని అన్నారు. కులగణనకి తామేం వ్యతిరేకం కాదని, కానీ పారదర్శకంగా అది జరగాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గ్రామదేవత పోచమ్మ తల్లిని దర్శించుకున్న బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు కరీంనగర్ ఐటీ టవర్ సమీపంలో మరో కార్యక్రమంలోనూ పాల్గొన్న బండి సంజయ్‌.. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

రుణమాఫీ ఎంతమందికి అయ్యిందని నిలదీశారు. రెండు లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని, మోదీ మీద విమర్శలు చేయపడం ఆపి, యుద్ధ ప్రాతిపదికన రుణమాఫి, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల గొంతు తడిపే అద్భత స్కీం అమృత్ అని చెప్పారు.

ప్రతి ఇంటికీ నీరు అందించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అమృత్ స్కీంలో ఇప్పటికే 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్‌లు అందించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమృత్ పథకం అమలవుతోందని చెప్పారు.

దీపావళి వేళ టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని కాల్చడంపై సుప్రీంకోర్టు సీరియస్‌.. ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు