Bandi Sanjay: బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ రిప్లయ్

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ నోటీసు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అన్నారు. పొలిటికల్ విమర్శలపై నోటీసులను తప్పుబట్టారు.

Bandi Sanjay

Bandi Sanjay Kumar : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లయ్ ఇచ్చారు. కేటీఆర్ కు కౌంటర్ నోటీసు ఇచ్చిన సంజయ్.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని, కేటీఆర్ పేరును ఎక్కడా వాడలేదని అన్నారు. పొలిటికల్ విమర్శలపై నోటీసులను తప్పుబట్టారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదని, తక్షణం ఆరోపణలను కేటీఆర్ వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారంలోగా నోటీసులు వెనక్కి తీసుకోకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 15 అంశాలతో కూడినటువంటి రిప్లయ్ నోటీసును కేటీఆర్ కు బండి సంజయ్ తరపు న్యాయవాదులు పంపించారు.

Also Read: Viral Video: కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఓ మహిళ కారణంగా ఢీకున్న వాహనాలు.. వీడియో వైరల్

ఈనెల 23న బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ నాపై తప్పుడు ఆరోపణలు చేశారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్  విషయంలో నాపై  సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని , నాపై చేసిన ఆరోపణలు వారం రోజుల్లో వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్  లీగల్ నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Also Read: తెలంగాణలో మోగనున్న మరో ఎన్నికల నగారా.. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు

అయితే, కేటీఆర్ లీగల్ నోటీసులపై ఆరోజే సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులా అంటూ మండిపడ్డారు. నోటీసులకు సరియైన సమాధానం నోటీసుల ద్వారానే చెబుతానని సంజయ్ చెప్పారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ కు సంజయ్ లీగల్ నోటీసులు పంపించారు.