SSC Paper leak Case: బండి సంజయ్‌కు బెయిల్ రద్దు చేయాలి: కోర్టులో పిటిషన్

SSC Paper leak Case: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం రేపింది. ఇప్పటికే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ దక్కింది.

SSC Paper leak Case: బండి సంజయ్‌కు బెయిల్ రద్దు చేయాలి: కోర్టులో పిటిషన్

Bandi Sanjay

Updated On : April 17, 2023 / 4:13 PM IST

SSC Paper leak Case: హనుమకొండ జిల్లాలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో స్పెషల్ పీపీ సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండలోని ఫోర్త్ ఎంఎం కోర్టులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించనున్నారు.

బండి సంజయ్ పోలీసు విచారణకు సహకరించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో నిందితులు ఏ6, ఏ9 కు బెయిల్ పై వాదనలు ముగిశాయి. కోర్టు నిర్ణయం రేపటికి వాయిదా పడింది. మరోవైపు, ఇప్పటికే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ హనుమకొండ జిల్లా కోర్టులో తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.

జిల్లా కోర్టు సూచన మేరకు ఫోర్త్ ఎంఎం కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. కాగా, తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ దక్కింది. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

Harish Rao: వారిని కాళేశ్వరం కాలువలో ముంచితే నిజం తెలుస్తది: హరీశ్ రావు