బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లలేక.. వెనక్కి తగ్గలేక డైలమా.. ఈ సారి క్యాబినెట్‌ భేటీలో అయినా..

పార్టీ పరంగానే బీసీలకు సీట్లు ఇద్దామా అనేదిదానిపై క్యాబినెట్‌ భేటీ తర్వాత క్లారిటీకి రానున్నారట. ఇలా 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

CM Revanth Reddy - BC reservations

BC Reservations: తెలంగాణ‌లో బీసీ రిజ‌ర్వేష‌న్ అంశం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 42 శాతం రిజ‌ర్వేష‌న్లను చ‌ట్టప‌రంగా ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌కపోవడంతో..ఈ ఇష్యూ నుంచి ఎలా బ‌య‌టప‌డాలో సర్కార్ పెద్దలకు అంతు చిక్కడ లేదట.

ఒకవైపు ప్రభుత్వాన్ని, మ‌రోవైపు పార్టీని కూడా ఇర‌కాటంలో ప‌డేసిన ఈ చిక్కుముడి వీడేదెలా..? అని చర్చోపచర్చలు జరుపుతున్నారట. మ‌రోవైపు సెప్టెంబ‌ర్ 30లోపు స్థానిక ఎన్నిక‌లు నిర్వహించాల‌ని హైకోర్టు పెట్టిన డెడ్‌లైన్‌తో ఎలా ముందుకెళ్లాలనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయట.

తెలంగాణ‌లో బీసీల‌కు విద్య, ఉద్యోగాల‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పిస్తామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజ‌ర్వేష‌న్లు ఇంప్లిమెంట్‌ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప‌లు ప్రయ‌త్నాలు చేసింది. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టి, డెడికేష‌న్ క‌మిష‌న్ ఏర్పాటు చేసి అసెంబ్లీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపంచింది. కానీ రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్రం ప‌రిధిలోనిది అంశం కావ‌డంతో..రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయ‌త్నాలేవీ వ‌ర్కౌట్‌ కావ‌డం లేదు.

Also Read: లేడీ డాన్‌ ఫోన్‌లో ఏముంది? ఆ లీడర్ల గుండెల్లో దడ..! ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయ్?

రాష్ట్రం నుంచి పంపించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ దగ్గర రెండుసార్లు ధ‌ర్నా కూడా చేసింది. లాస్ట్‌కు కొండంత రాగం తీసి..ఇప్పుడు ఓవర్‌ టు లీగర్ ఒపీనియన్‌ అన్నట్లుగా మార్చేసింది సీన్.

బీసీ కోటా తేల‌క‌పోవ‌డంతో ఏడాదిన్నర‌గా లోకల్ బాడీ ఎన్నిక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 30 లోపు లోకల్‌ బాడీ పోల్స్‌ నిర్వహించాలని హైకోర్టు పెట్టిన డెడ్‌లైన్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

కోర్టు తీర్పు నేప‌థ్యంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశం ప్రభుత్వానికి ముందు నుయ్యి..వెన‌క గొయ్యిలా త‌యారైందట. (BC Reservations)

చ‌ట్టప‌రంగా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో..పార్టీ ముఖ్యనేత‌ల‌తో చ‌ర్చించేందుకు కాంగ్రెస్‌ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ భేటీ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో నేత‌ల మ‌ధ్య హాట్‌ హాట్‌ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. చ‌ట్టప‌రంగా బీసీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌క‌పోతే..పార్టీపై న‌మ్మకం పోతుంద‌ని..బీసీల్లో పార్టీ చుల‌క‌న అవుతుంద‌నే ఆందోళ‌న వ్యక్తం చేశార‌ట‌.

మ‌రోసారి మంత్రుల‌తో స‌బ్ క‌మిటీ

అంతేకాదు ఈ ఎఫెక్ట్ బీహార్ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డే ప్రమాదం ఉంద‌ని అభిప్రాయపడ్డారట. దీంతో ఏం చేయాలో అర్థంకాక మ‌రోసారి మంత్రుల‌తో స‌బ్ క‌మిటీ వేశారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్‌, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్కల‌తో క్యాబినెట్ స‌బ్ క‌మిటీని నియమించారు. క‌మిటీ భేటీలో కూడా లాజిక‌ల్ క‌న్ క్లూజ‌న్ రాక‌పోవ‌డంతో..సీనియ‌ర్ న్యాయ‌నిపుణులు జ‌స్టిస్ సుద‌ర్శన్‌రెడ్డి, అభిషేక్ మ‌నుసింగ్వీలతో భేటీ అయ్యారు.

చేసేది లేక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. రాహుల్ సూచ‌న‌, స‌ల‌హా ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యార‌ట‌. రాహుల్ సూచ‌న‌లను బేస్‌ చేసుకుని ఈ నెల 29న జ‌రిగే క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుని..లోక‌ల్ బాడీ ఎన్నిక‌లపై ముందుకు వెళ్లాల‌ని అనుకుంటున్నారు. పాత ప‌ద్దతిలోనే జీవో ఇచ్చి ఎన్నిక‌ల‌కు వెళ్లాలా.? లేక రిజ‌ర్వేష‌న్లు పెంచుతూ జీవో ఇచ్చి..కోర్టుల‌్లో కేవియ‌ట్ పిటిష‌న్ వేస్తే లీగల్ ఇష్యూస్ ఏముంటాయి?

లేక పార్టీ పరంగానే బీసీలకు సీట్లు ఇద్దామా అనేదిదానిపై క్యాబినెట్‌ భేటీ తర్వాత క్లారిటీకి రానున్నారట. ఇలా 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 29న జ‌రిగే క్యాబినెట్ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్ పెంపు అంశం లాజిక‌ల్ క‌న్ క్లూజ‌న్ వ‌చ్చే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారై కోటా పంచాయితీ తేలుతుందా.? లేక మళ్లీ మొదటికి వస్తుందా అనేది చూడాలి మరి.