Conjunctivitis : బీకేర్ ఫుల్.. తెలంగాణలో క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌ళ్ల క‌ల‌క.. ఆ తప్పు అస్సలు చేయొద్దు, తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల రోజుల వ్యవధిలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ వ్యాపిస్తుంది. Conjunctivitis

Conjunctivitis Spread in Telangana : తెలంగాణలో కళ్ల కలక కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు జనాలను కలవరపెడుతున్నాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కండ్ల కలక సీజనల్ వ్యాధి. వర్షాలకు నీటి కాలుష్యంతో ఇన్ ఫెక్షన్ తో ఇది సోకుతుంది. వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్లలో కళ్ల కలక ఒకటి. వర్షాల వల్ల గాలిలో తేమ, చెమ్మ కారణంగా వైరస్ లు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయి.

ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న బాధితుల్లో ఎక్కువమందికి అడెనో వైరస్ కారణం అని పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఒక్క సరోజినీదేవి ఆసుపత్రికే రోజుకు 30 నుంచి 40మంది బాధితులు వస్తున్నారు. నిన్న 95మంది వస్తే ఇవాళ 60 కేసులు నమోదయ్యాయి.

Also Read..Skin Allergies : మామిడి పండు చర్మానికి అలెర్జీని కలిగిస్తుందా?

కళ్ల కలక లక్షణాలు..
కళ్లు ఎర్రబారతాయి.
కళ్ల నుంచి నీరు కారుతుంది.
కళ్లలో మంటలు పుడతాయి.
కళ్ల కలక వస్తే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కళ్లు ఎరుపెక్కడం, దురద, కాంతిని చూడలేకపోవడం, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు కళ్ల కలక బాధితుల్లో కనిపిస్తాయి.

కళ్లు నలపొద్దు..
ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ వ్యాపిస్తుంది. దురదగా ఉందని కళ్లు నలపడం, సొంత వైద్యం చేసుకోవడం వంటివి చేయొద్దని, డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Also Read..After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే

వారి వస్తువులు తాకొద్దు..
మన పరిసరాలు, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇంట్లో ఎవరికైనా కళ్ల కలక ఉంటే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు, టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు తాకడం, వాడటం చేయొద్దని డాక్టర్లు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారి వస్తువులు తాకితే తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కళ్ల కలక వస్తే తప్పనిసరిగా కళ్లద్దాలు ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సీజన్ లో కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బయటి నుంచి వచ్చాక గోరు వెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవడం మంచిదన్నారు. కళ్ల కలక బారిన పడితే కచ్చితండా డాక్టర్ ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు