రైల్వే స్టేషన్ వద్ద మహిళ మృతదేహం కేసు.. ఆటోలో మృతదేహాన్ని 37 కి.మీ. తీసుకొచ్చి, ఆ మూటను యువకుడు ఎలా ఎత్తుకెళ్లాడో చూడండి..
మృతదేహాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లాడు ఆ యువకుడు.

Charlapalli
Charalapalli case: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ మృతదేహం బెంగాల్‌కు చెందిన ప్రమీల అనే మహిళదని తేల్చారు. పది సంవత్సరాల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు.
మరో బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం పెరిగింది. హైదరాబాద్, కొండాపూర్ ప్రాంతంలో ఆ యువకుడితో కలిసి ఉంది. అతడే ప్రమీలను చంపి మూటలో వేశాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకుని, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.
మృతదేహాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లాడు ఆ యువకుడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్లాడు. అసోంకు వెళ్లే ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (Charalapalli case)
రైల్వే స్టేషన్ సమీపంలో స్థానిక ఆటో డ్రైవర్లు మూటను గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.