Actress Hema : విచారణకు రావాల్సిందే..! మరోసారి నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Hema

Bengaluru Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు.

Also Read :  Artist Hema : రేవ్ పార్టీపై 10టీవీతో స్పందించిన నటి హేమ.. ఏమందంటే..

నేను వైరల్ ఫివర్ తో బాధపడుతున్నాను. ప్రస్తుతం విచారణకు రాలేను. మరోసారి విచారణకు హాజరవుతానని చెబుతూ బెంగళూరు సీసీబీ పోలీసులకు నటి హేమ లేఖను పంపించారు. విచారణకు  హేమతో పాటు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు కార్ ఓనర్లకు, ఎమ్మెల్యే కాకాని కార్ స్టిక్కర్ ఉన్న కార్ ఓనర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి మరోసారి సీసీబీ పోలీసులు వివిధ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతోపాటు మరికొందరికి నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, జూన్ 1వ తేదీన విచారణకోసం హేమ బెంగళూరు వెళ్తారా? ఈసారి కూడా ఏదైనా కారణం చెప్పి విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Also Read : Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తాను పాల్గొనలేదని నటి హేమ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడిచేసిన రోజున హేమ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆమె అదేరోజు నేను బెంగళూరు రేవ్ పార్టీ లో పాల్గొనలేదని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వీడియో విడుదల చేశారు. మరుసటి రోజు వంట చేస్తూ ఇంట్లోనే ఉన్నానని వీడియో విడుదల చేశారు. బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పట్టుబడిందని, ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపించామని చెప్పారు. బ్లడ్ శాంపిల్స్ పరీక్షలో హేమ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు ఉండటంతో బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు