Bhatti Vikramarka: చర్చకు సిద్ధమా..! కాళేశ్వరం ప్రాజెక్టు‌‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: చర్చకు సిద్ధమా..! కాళేశ్వరం ప్రాజెక్టు‌‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు.

Mallu Bhatti Vikramarka

Updated On : April 18, 2023 / 11:20 AM IST

Bhatti Vikramarka: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్ర (Hath Se Hath Jodo Yatra) లో భాగంగా భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 33వ రోజు పెద్దపల్లి జిల్లా (Peddapally district) లో కొనసాగుతోంది. మంగళవారం 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. ధర్మపురి నియోజకవర్గం (Dharmapuri Constituency) రచ్చపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై.. రచ్చపల్లి గ్రామం నుంచి రామాయపల్లి మీదుగా పెద్దపల్లి నియోజకవర్గం పాల్తేం గ్రామంలోకి ప్రవేశిస్తుంది. పెద్దపెల్లి నియోజకవర్గం పాల్తెం, దొంగతుర్తి, కాస్రపల్లి క్రాస్ రోడ్, కాపులపల్లి ఎక్స్‌రోడ్, మేరపల్లి, తెనుగువాడ, పెద్దపల్లి, హనుమంతుని పేట, రాంపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి ఏడు గంటలకు పెద్దపల్లి రాజీవ్‌చౌక్ వద్ద కార్నర్ మీటింగ్ జరుగుతుంది.

Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

పాదయాత్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు లిఫ్ట్ చేసిన నీళ్లు 115 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని, కేవలం కరెంటు బిల్లులు కట్టడం తప్పఅంటూ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్టు చేసే నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లే ఎక్కువ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక గుదిబండల ఈ రాష్ట్రానికి తగిలించి లక్ష కోట్లకు‌పైగా డబ్బులు వృధా చేసింది అన్నారు.

Mallu Bhatti Vikramarka : రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటున్న కేసీఆర్ ఫ్యామిలీ.. వ్యవసాయానికి సాయమే లేదు : మల్లు భట్టి విక్రమార్క

కాళేశ్వరం ప్రాజెక్టు కిందికి వదిలిన, లిఫ్ట్ చేసిన నీళ్లపై మేము డిబేట్‌కు సిద్ధమని, చర్చకు మీరు సిద్ధమా అంటూ భట్టి విక్రమార్క సవాల్ చేశారు. తెలంగాణలో వ్యవసాయానికి నీళ్లు రాకుండా చేయడమే కాకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ అవగాహన రాహిత్యం‌తో నిర్మించిన ప్రాజెక్టు తప్ప మరేమీ లేదన్నారు.