బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు రాహిల్ కేసులో కొత్త ట్విస్ట్.. మరోకేసు తెరపైకి..

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం రోడ్ నెం.45లో కారు ప్రమాదం జరిగింది.

Jubilee Hills Road Accident : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం రోడ్ నెం.45లో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు రహీల్ డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పుడు ఆ కేసును వెస్ట్ జోన్ పోలీసులు రీ ఓపెన్ చేశారు. ఆ ప్రమాదంకూడా షకీల్ కొడుకు రాహీల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన మూడు రోజులకు రాహీల్ డ్రైవర్ అఫ్రాన్ తానే కారు నడిపినట్లు చెప్పడంతో అఫ్రాన్ పై కేసు నమోదు చేసి పోలీసులు అప్పట్లో రిమాండ్ కు పంపించారు. తాజా దర్యాప్తులో ఆరోజు కారులో నడిపింది రాహీల్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో షకీల్, ఆయన కుమారుడు రాహిల్ పరారీలో ఉన్నారు. వారికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయిన విషయం తెలిసిందే.

Also Read : Praja Bhavan Barricades : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆసుపత్రిలో సీఐ

2022 మార్చి17న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థాన్ వాహనం రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు కాగా.. రెండు నెలల బాలుడు మరణించాడు. ప్రమాదానికి గురైన కారు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ దిగా తేలింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించగా.. అఫ్రాన్ అనే యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. స్టీరింగ్ పై వేలిముద్రలు అఫ్రాన్ వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

Also Read : రోహిత్, హార్దిక్ కలిసిపోయారు..! వాంఖెడే స్టేడియంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

ఇటీవల బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. కారులో షకీల్ కొడుకు రాహిల్, మరో యువకుడు ఉన్నట్లు తేలింది. దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఆరోజు కారు నడిపించి రాహీల్ అని గుర్తించారు. లావుగా ఉన్న వ్యక్తి డ్రైవింగ్ సీటులో నుంచి దిగి పారిపోయాడని బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా షకీల్ కొడుకు రాహీల్ డ్రైవింగ్ సీటులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు