×
Ad

Hyderabad Begging Mafia : ట్రాన్స్‌జెండర్స్ వేషంలో బీహార్ బ్యాచ్ బెగ్గింగ్ దందా .. హైదరాబాద్ లో మరో బెగ్గింగ్ మాఫియా

హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ పేరుతో మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వృద్ధులు,చిన్నారులు,మహిళలతో బెగ్గింగ్ మాఫియాతో అక్రమార్కులు దందాలకు దిగుతున్నారు. బీహార్ ముఠా చేసే బెగ్గింగ్ దందాలు బయటపడుతున్నాయి.

  • Published On : August 19, 2023 / 11:06 AM IST

Bihar batch Begging mafia in Hyderabad

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తు బెగ్గింగ్ మాఫియా నడిపిస్తున్న అనిల్ పవార్ అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం (ఆగస్టు 18,2023)న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల నుంచి వృద్ధులకు తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ.200లు ఇచ్చి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేయించి బెగ్గింగ్ మాఫియా చేస్తున్న అనిల్ పవార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఇటువంటి దందాలు నగరంలో జరుగుతున్నాయా? అనే కోణంలో నిఘా పెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసులు దర్యాప్తులో హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆడగాలు ఒక్కొక్కటి బయటపడుతున్నారు.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

దీంట్లో భాగంగానే బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో బెగ్గింగ్ మాఫియా గుట్టును బటయపెట్టారు టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు. బీహార్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన కొంతమంది ముఠాగా ఏర్పడి ట్రాన్స్ జెండర్ల వేషాట్లో బెగ్గింగ్ లకు దిగుతున్నారని గుర్తించారు. సికింద్రాబాద్,ప్యారడైజ్,బూబ్లీబస్ స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్ల వేషాలతో డబ్బులు వసూళ్లు చేస్తున్న 15మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు బెగ్గింగ్ ముఠాకు చెందిన మరో ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

Haryana : చీర కోసం భార్య గొడవ, సెక్యూరిటీ గార్డుని కాల్చి చంపిన వ్యక్తి

ట్రాన్స్ జెండర్ల వేషాలతో బీహార్ నుంచి వచ్చిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి బెగ్గింగ్ లకు పాల్పడుతున్న జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని..అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.