Haryana : చీర కోసం భార్య గొడవ, సెక్యూరిటీ గార్డుని కాల్చి చంపిన వ్యక్తి

చీర కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తిని కాల్చి చంపే వరకు వెళ్లింది. ఆవేశం ఓ మనిషి చావుకు కారణమైంది. చిన్నపాటి గొడవ ఎదుటి మనషిని కాల్చి చంపేందుకు కారణమైంది.

Haryana : చీర కోసం భార్య గొడవ, సెక్యూరిటీ గార్డుని కాల్చి చంపిన వ్యక్తి

Haryana

Haryana : హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలోని చీర కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తిని కాల్చి చంపేవరకు వెళ్లింది. జిల్లాలోని నాథ్‌పూర్‌ గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చీర కోసం జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. నాథ్ పూర్ గ్రామంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజయ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రీనాతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మరో ఇంట్లో బీహార్ కు చెందిన పింటూ అనే 30 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

పింటూ తన చీరను దొంగిలించాడు అంటూ రీనా తన భర్త అజయ్ సింగ్ కు చెప్పింది. దీంతో గత మంగళవారం (ఆగస్టు15,2023) రాత్రి 8.00 గంటల సమయంలో పింటూని అజయ్ సింగ్ నిలదీశాడు. పింటూ చీర సంగతి తనకు తెలియదని తానేమీ తీయలేదని చెప్పాడు. కానీ అజయ్ సింగ్ ఊరుకోలేదు. మర్యాదగా నిజం చెప్పు అంటూ గట్టిగా అరిచాడు.దానికి పింటూ కూడా ఊరుకోలేదు. అలా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన అజయ్ సింగ్ తన ఇంట్లో నుంచి పెద్ద డబుల్ బ్యారెల్ గన్ను తెచ్చి పింటూను కాల్చే ప్రయత్నం చేశాడు. పింటూతో పాటూ ఉంటున్న అతడి స్నేహితులు అజయ్ సింగ్‌ నుంచి తుపాకీ లాగేసుకున్నారు. అజయ్ మళ్లీ వాళ్ల వద్ద ఉన్న తుపాకీని బలవంతంగా తీసుకుని పింటూని కడుపులో కాల్చాడు.

రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన పింటూను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతు పింటూ చనిపోయాడు. దీంతో పింటూ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అజయ్‌ సింగ్‌పై హత్య, ఆయుధ చట్టం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి గన్ను, లైసెన్స్‌తో పాటూ ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పింటూ స్నేహితుడు అజయ్ కుమార్ ప్రత్యక్ష సాక్షిగా ఉండటంతో అతని వాంగ్ములాన్ని పోలీసులు రికార్డు చేశారు.

ED Cese On Prajapati : ఉద్యోగాల పేరుతో రూ.720 కోట్లు దోపిడీ .. గుజరాత్‌కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు