Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, చిన్న పిల్లలను, మహిళతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. మహిళల చేతికి చంటిబిడ్డలను ఇచ్చి బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కునేలా చేసి  ఆ డబ్బుతో బెగ్గింగ్‌ మాఫియా కోట్ల రూపాయలు గడిస్తోంది.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

Hyderabad Begging Mafiya

Hyderabad Begging mafia : హైదరాబాద్ (Hyderabad)లో బెగ్గింగ్ మాఫియా (Begging mafia)గుట్టును రట్టు చేశారు పోలీసులు. వృద్ధులను తీసుకొచ్చి వారితో భిక్షటన చేయిస్తు డబ్బులు సంపాదిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనిల్ పవార్ (Anil Pawar)అనే వ్యక్తి నగరంలో పలువురు వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్నాడు. వారితో భిక్షాటన చేయిస్తు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కరికి రోజుకు రూ.200లు ఇచ్చి.. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బు అంతా తానేతీసుకుంటాడు. అలా నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో వారిని కూర్చోబెట్టి భిక్షటన చేయిస్తాడు. ఆ వచ్చిన మొత్తాన్ని తానే తీసుకుని ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారికి రూ.200లు ఇస్తాడు. అలా బెగ్గింగ్ మాఫియాతో అనిల్ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఈక్రమంలో పోలీసులు బెగ్గింగ్ మాఫియాను గుర్తించిన పోలీసులు నిర్వహకుడు అనిల్ పవార్ ను అరెస్ట్ చేశారు. అలాగే దాదాపు 25మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా దేశ వ్యాప్తంగా బెగ్గింగ్ మాఫియా నడుస్తోంది. రూపాయి పెట్టుబడి లేకుండానే రూ.లక్షలే కాదు కోట్ల సంపాదన వచ్చే మార్గాల్లో బెగ్గింగ్ మాఫియా కూడా ఒకటి. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్ల చేతికి చంటిబిడ్డలను ఇచ్చి బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కునేలా చేసి  ఆ డబ్బుతో బెగ్గింగ్‌ మాఫియా కోట్ల రూపాయలు గడిస్తోంది. అటువంటి బెగ్గింగ్ మాఫియా హైదరాబాద్‌ నగరంలో వెలుగుచూసింది.

Hyderabad : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పైనుండి పడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు

అనిల్ పవార్ అనే వ్యక్తి వృద్ధులకు డబ్బులు ఆశచూపి బెగ్గింగ్ మాఫియాలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులు బెగ్గింగ్‌ మాఫియాను గుర్తించారు. ప్రధాన నిందితు అనిల్ పవార్ ను అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన అనిల్‌ పవార్‌ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధుల్ని తీసుకొచ్చి వారికి రోజుకు రూ.200లు ఇచ్చి జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్, కేబీఆర్‌ పార్క్ దగ్గర భిక్షాటన చేయిస్తు బెగ్గింగ్ మాఫియా చేస్తున్నాడు. వారు రోజంతా ఎండలోను, చలిలోను, వానలోను కూడా కష్టపడి యాచించిన సొమ్మును తానే తీసేసుకుంటున్నాడు.రోజుకు వారికి కేవలం రూ.200లు ఇచ్చి మిగిలినదంతా తానే దోచుకుంటున్నాడు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియా గుట్టు రట్టు చేసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్(Jubilee Hills Check Post), కేబీఆర్‌ పార్క్ (KBR Park)వద్ద బిక్షాటన చేస్తున్న దాదాపు 25మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు..? సిటీలో ఇంకా ఎంతమంది ఉన్నారు.. అనిల్ పవార్ తో పాటు ఈ బెగ్గింగ్ మాఫియాలో ఇంకా పాత్రధారులు, సూత్రధారులు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.