Telangana BJP
BJP Acceptance Applications : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ నేటి నుండి ఆశావాహుల దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించనుంది.
కమలం పార్టీ ఆరు రోజులపాటు ఆశావాహుల నుండి దరఖాస్తులు తీసుకోనుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకపోవడంతో భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్య నేతలు ఎక్కడి నుండి దరఖాస్తు చేసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Amit Shah: తెలంగాణలో ఈ సారి సీఎం అయ్యేది కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు..ఆయనే..: అమిత్ షా
గజ్వేల్ నుండి కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తాడా..? కామారెడ్డిలో విజయశాంతి నిలబడుతుందా..? సిద్దిపేట నుండి హరీష్ రావు పైన రఘునందన్ రావు పోటీ చేస్తాడా..? సిరిసిల్ల నుండి కేటీఆర్ పై బండి సంజయ్ బరీ లో దిగుతాడా..? అనేవి తేలనున్నాయి. వారంలో బీజేపీ వ్యూహం తేలనుంది.