మూడేళ్లలో 12కోట్ల నిధులు తీసుకొచ్చా.. భారీ మెజార్టీతో గెలుపు ఖాయం : బండి సంజయ్

నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.

Bandi Sanjay Kumar : కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన 10టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పోటీచేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వాళ్లిద్దరూ వ్యాపారంకోసం, సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి సభ్యత్వం ఉందో తెలియదని పార్టీ శ్రేషులు విస్మయం చెందుతున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజా ఉద్యమాలు చేసినందుకు నామీద 109 కేసులు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందని సంజయ్ విమర్శించారు.

Also Read : Lok Sabha Polls 2024 : ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. 13 రాష్ట్రాల్లో 89లోకసభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్..!

నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు. పోయిన ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందిన వారైనా ఎంపీగా నేను విజయం సాధించా. ఇప్పుడుకూడా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా నా విజయం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read : మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. హైదరాబాద్ అభ్యర్థి ఎవరో తెలుసా?

కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జిషిట్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు.. ఆయనకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు అంటూ సంజయ్ విమర్శించారు.

 

ట్రెండింగ్ వార్తలు