BJP Janasena Alliance
BJP Janasena Alliance : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అశ్వరావుపేట, వైరా, కొత్తగూడెం సీట్లను జనసేనకు కేటాయించనున్నారు. నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్ పల్లి, తాండూర్ స్థానాలను కూడా జనసేనకే కేటాయించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
Also Read : ముందు మీ కథ మీరు చూసుకోండి- సజ్జలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
అయితే, శేరిలింగంపల్లి సీటు కోసం జనసేన పట్టుబడుతోంది. కానీ, శేరిలింగంపల్లి సీటు జనసేనకు ఇచ్చేస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ సీటుని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు బీజేపీ మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు జాబితాల్లో మొత్తం 88మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన స్థానాల్లో గెలుపు గుర్రాల ఎంపిక దాదాపు పూర్తి చేసింది.
Also Read : అభివృద్ధికి తిలోదకాలు, కక్షపూరిత రాజకీయాలు .. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు : పురందేశ్వరి
ఇక నేడో, రేపో ఫోర్త్ లిస్ట్ ను కూడా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నాలుగో జాబితాలో 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జనసేనకు కేటాయించే స్థానాలు మినహా మిగతా సీట్లకు గెలుపు గుర్రాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ అధిష్టానం.