Purandeshwari : అభివృద్ధికి తిలోదకాలు,కక్షపూరిత రాజకీయాలు .. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు : పురందేశ్వరి

అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురందేశ్వరి.

Purandeshwari : అభివృద్ధికి తిలోదకాలు,కక్షపూరిత రాజకీయాలు .. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు : పురందేశ్వరి

Purandeshwari

Updated On : November 6, 2023 / 3:38 PM IST

Purandeshwari..YCp Govt : రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నింస్తుంటే ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..? అంటూ ప్రశ్నించారు.శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమె మాట్లాడుతు.. ప్రభుత్వ పాలన విషయంలో విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టిడిపి కోవర్ట్ అంటూ వ్యాఖ్యలు చస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని మరోసారి స్పష్టంచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని ఈ సందర్భగా పురందేశ్వరి వెల్లడించారు. ఏపీలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని…అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని ఈ సందర్భంగా ఆమె స్పష్టంచేశారు.

పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన యామినీ శర్మ

రాష్ట్రంలో నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇల్లు కేటాయిస్తే ఎన్ని ఇల్లు నిర్మించారో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరువు జిల్లాలైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసిపి ప్రభుత్వం చెరువులకు నీరు ఇస్తామమని చెప్పి అందించ లేకపోయారని ఆరోపించారు.అభివృద్ధికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని వెల్లడించారు.మా ప్రభుత్వం కేటాయించిన నిధులు స్టిక్కర్లు వేసుకుని వైసిపి పరిపాలన కొనసాగిస్తున్నారు అంటూ విమర్శించారు.అధికార ప్రభుత్వం పరిపాలన ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని..అవినీతి మరక లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు.