YS Sharmila : ముందు మీ కథ మీరు చూసుకోండి- సజ్జలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. YS Sharmila

YS Sharmila Counter To Sajjala
YS Sharmila Counter To Sajjala : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఎస్ కుటుంబాన్ని వేధించిందో, కేసులతో సీఎం జగన్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే అన్నారు. అయినా.. ఆమె పార్టీ ఆమె ఇష్టం అంటూ సజ్జలు వ్యాఖ్యానించిన విషయం విదితమే. తనను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు. సజ్జలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read : అభివృద్ధికి తిలోదకాలు,కక్షపూరిత రాజకీయాలు .. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు : పురందేశ్వరి
గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల తేల్చి చెప్పారు.
Also Read : కాంగ్రెస్‌కు షర్మిల మద్దతుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
“నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలి రోజే.. ఆమె పార్టీ పెడితే మాకేంటి సంబంధం అన్న వ్యక్తి సజ్జల. ఇవాళ ఏ సంబంధం ఉందని సజ్జల నా గురించి మాట్లాడుతున్నారు? నేనైతే ఏ సంబంధం లేదనే అనుకుంటున్నా. మరి మీరు మాట్లాడుతున్నారంటే సంబంధం మళ్లీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనా? ఏమనుకోవాలి మేము? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. ఓవైపు సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ.. చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే.. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు సజ్జల? ముందు మీ కథ మీరు చూసుకోండి” అని ఘాటుగా సజ్జలకు బదులిచ్చారు వైఎస్ షర్మిల.