Sajjala Ramakrishna Reddy : కాంగ్రెస్‌కు షర్మిల మద్దతుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, కాంగ్రెస్ కు మద్దతివ్వాలని షర్మిల తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy On Sharmila (Photo : Google)
Sajjala Ramakrishna Reddy On Sharmila : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని వైఎస్ఆర్ టీపీ (వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కాంగ్రెస్ కు ఓటేయాలని షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటే తనకు గౌరవం అని, తాము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల కేసీఆర్ మళ్లీ సీఎం అయితే చరిత్ర తనను క్షమించదని షర్మిల ఈ సందర్భంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, కాంగ్రెస్ కు మద్దతివ్వాలని షర్మిల తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం-సజ్జల
షర్మిల నిర్ణయం ఏపీ పాలిటిక్స్ లోనూ డిస్కషన్ కు దారితీసింది. షర్మిల సంచలన నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు, ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం అన్నారు సజ్జల. విధానపరమైన నిర్ణయంలో భాగంగానే షర్మిల మద్దతు ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. ఆమెకు, కాంగ్రెస్ కు మధ్య అవగాహన ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది, ఇబ్బందులు పెట్టింది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు సజ్జల. అంతేకాదు సీఎం జగన్ పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు సజ్జల. ఏది ఏమైనా సాధారణంగా పక్క రాష్ట్రాల విషయాలను సీఎం జగన్ పెద్దగా పట్టించుకోరు అని వెల్లడించారు సజ్జల.
Also Read : స్కిల్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్‌లపై ఫిర్యాదు, సీఐడీ ఏం చేయనుంది?
వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిన పార్టీ, జగన్ ను ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్-సజ్జల
తాడేపల్లిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సజ్జల. ‘జగన్ ని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో షర్మిల కలిశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించింది. ఇబ్బందులు పెట్టింది. ఇది అందరికీ తెలుసు. జగన్‌పైనా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం- షర్మిల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటిదాకా 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన షర్మిల సడెన్ గా తన నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ పాలనను అంతం చేయడానికే పార్టీ పెట్టామని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నామని షర్మిల వివరించారు. తెలంగాణ ప్రజల క్షేమం కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు షర్మిల. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కారణంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు పోటీకి దూరంగా ఉంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ దూరం, కాంగ్రెస్ కు మద్దతు : వైఎస్ షర్మిల
మా నాన్న బతికుంటే ఆయన ఇప్పటికే ప్రధాని అయ్యేవారు-షర్మిల
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రధాని అయ్యేవారని షర్మిల అన్నారు. ”రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 35ఏళ్లు సేవ చేశారు. రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ కుటుంబం అంటే చాలా అభిమానం. రాహుల్ ను ప్రధానిని చేయాలని మొట్టమొదట వైఎస్ఆరే అన్నారు. సోనియా, రాహుల్ లు నా తండ్రిపై తమకున్న అభిమానం, గౌరవాన్ని నాపై చూపుతున్నారు” అని షర్మిల అన్నారు.