Skill Scam : స్కిల్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్‌లపై ఫిర్యాదు, సీఐడీ ఏం చేయనుంది?
కాంట్రాక్ట్, చెక్ పవర్ తో సంబంధం ఉన్నవారందరినీ ప్రశ్నించాలన్నారు. దీంతో సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Twist In Skill Scam

Twist In Skill Scam
Twist In Skill Scam : ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మరో ట్విస్ట్. 12మందికిపైగా ఐఏఎస్ లను విచారణ పరిధిలోకి తీసుకురావాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని ఐఏఎస్ లను ప్రశ్నించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజయ్ కల్లం, అజయ్ జైన్, రావత్, రవిచంద్రతో పాటు ఉదయ్ లక్ష్మి, ప్రేమ చంద్రారెడ్డి, సిసోడియాలను విచారించాలన్నారు. అలాగే కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జయలక్ష్మిలను కూడా విచారించాలన్నారు.
వీరిలో కొందరు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉండగా మరికొందరు రిటైర్ అయ్యారు. మరోవైపు ప్రస్తుత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సీఎండీ బంగారు రాజు, సీఎఫ్ఓ, సీఈవోలను కూడా ప్రశ్నించాలని ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్, చెక్ పవర్ తో సంబంధం ఉన్నవారందరినీ ప్రశ్నించాలన్నారు. దీంతో సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కీలకంగా ఉన్న ఒక ఐఏఎస్ ను తప్పించారని టీడీపీ ఆరోపిస్తోంది.
Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ
వజ్జా శ్రీనివాసరావు, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది
”స్కామ్ జరిగిందని స్పష్టంగా చెబుతున్నారు సీఐడీ అధికారులు, సీఐడీ తరపు లాయర్లు. స్కామ్ జరిగినప్పుడు మనీ మొబలైజేషన్, చెక్ పవర్, ప్రభుత్వం తరపున బిల్లు పే చేయడానికి ఎవరికైతే పవర్ ఉందో వారందరినీ కూడా ఈ కేసులో ఈరోజుకి కూడా ముద్దాలుగా తీసుకురాలేదు. వారిని ముద్దాయిలుగా తీసుకురావాలని ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐడీ అధికారులు సరిగా స్పందించలేదని ఫిర్యాదుదారు చెప్పారు. దీనిపై కోర్టుని ఆశ్రయిస్తాం. కోర్టు ద్వారా వారిపై విచారణ జరిపేలా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరతాం.”