Kinjarapu Atchannaidu : ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసా? 40వేల కోట్లు దోచిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి?- సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu : ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసా? 40వేల కోట్లు దోచిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి?- సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

Kinjarapu Atchannaidu Slams CM Jagan (Photo : Google)

Updated On : November 2, 2023 / 9:41 PM IST

Kinjarapu Atchannaidu Slams CM Jagan : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయి అంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనింపించటం లేదా? అని ధ్వజమెత్తారు. ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

”నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ.40వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? అధికారికంగా 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలు అని చెబుతూ 500కు పైగా రీచ్ లలో ఇసుక దోచేయటం వాస్తవం కాదా? ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వలేదా? మీ ఇసుక దోపిడీకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి జగన్ రెడ్డి? ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికులను బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి.

Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ

ఇప్పటికే 3సార్లు ఇసుక పాలసీ మార్చారు. ఇప్పుడు జగన్ తన తమ్ముడు అనిల్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఇసుక టెండర్లు అనిల్ రెడ్డికి కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలన్నీ మార్చేసి డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించారు. ఉన్న ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్. అందుకే ఈ కుట్ర. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో జే గ్యాంగ్ దేనినీ వదలటం లేదు. ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికా అన్ని దోచేస్తున్నారు” అని తీవ్ర ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు.

Also Read : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు