Botcha Satyanarayana : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కలకాలం ఉండాలి. కానీ నిజాయితీగా ఉండాలని మా ప్రభుత్వం కోరుతుంది. ఒంట్లో బాగోలేదు.. కంట్లో బాగోలేదు.. చర్మ వ్యాధి వచ్చిందని బెయిల్ తెచ్చుకున్నారు. Botcha Satyanarayana

Botcha Satyanarayana : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Botcha Satyanarayana Sensational Comments (Photo : Twitter)

Updated On : November 1, 2023 / 5:27 PM IST

Botcha Satyanarayana Sensational Comments : ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పేదలకు జగన్ ను దూరం చేయాలని కుట్ర జరుగుతోందని, దీన్ని అందరూ గమనించాలని మంత్రి బొత్స అన్నారు. జగన్ ని గద్దె దించాలని, దోపిడీదారుల పార్టీని మళ్లీ గద్దెనెక్కించాలని కొందరు చూస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు.

”కొన్ని రోజులుగా మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. కానీ, మనం వ్యవస్థలను మ్యానేజ్ చేస్తునట్లు చెబుతున్నారు. ఇది గమనిస్తున్నారా. దొరికితే దొంగ. దొరక్కపోతే దొర పాత సినిమాల్లా టీడీపీ నేతల వ్యవహారం ఉంది.
చట్టంలో లోపాలతో ఆనాడు దోపిడీ చేశారు. లొసుగులతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారు చేసిన దోపిడీని పక్కా సాక్ష్యాలతో న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. అంతే.

Also Read : చంద్రబాబు మళ్లీ అదే జైలుకెళ్లాలి, సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి- టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్

ఒంట్లో బాగోలేదు.. కంట్లో బాగోలేదు.. చర్మ వ్యాధి వచ్చిందని బెయిల్ తెచ్చుకున్నారు. మంచిదే బెయిల్ తెచ్చుకోని. దానికి మన ప్రభుత్వం అడ్డుపడలేదు కదా. చంద్రబాబు కలకాలం ఉండాలి. కానీ నిజాయితీగా ఉండాలని మా ప్రభుత్వం కోరుతుంది. అంతేగాని అవినీతి చేస్తే ఊరుకోము.
దోపిడీ చేసి దోచుకోవడానికి ప్రజలు ఎన్నుకోలేదు. ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్లు ఎంత అసభ్యంగా మాట్లాడారో చూశారుగా. కొంతమంది ఏం పీకారు అన్నారు. ఇప్పుడు చూశారుగా ఏం పీకామో. దోపిడీ చేసింది వారు. తిరిగి మనపై అభాండాలు వేయడం ఏంటి?

రైలు ప్రమాదంలో గాయపడ్డ వారికి పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ కు చెప్పాం. ఈ ప్రమాదంలో శాశ్వతంగా అంగవైకల్యం వచ్చిన వారికి రూ.10 లక్షలు, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండి చికిత్స తీసుకోవాల్సిన వారికి రూ.5లక్షలు ఇచ్చాం. చిన్న చిన్న గాయాలైన వారికి రూ.2 లక్షలు ఇచ్చాం.
ఇలాంటి సందర్భాల్లో మానవాతా దృక్పథంతో స్పందించాలి. అలాంటి ఆలోచన రావాలి. చంద్రబాబుకి ఇటువంటి మానవతా ఆలోచన రాదు. రైతు అంటే చంద్రబాబుకి గిట్టదు. అందుకే రైతులను ఆదుకోడు. ఇవన్నీ ప్రజలకి మరోసారి తెలపాలి. ప్రజలు చాలా తెలివైన వారు” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Also Read : చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?