Chandrababu Naidu : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ
చంద్రబాబుపై తాజాగా కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. Chandrababu

Another Case On Chandrababu
Another Case On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఆయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. ఈ కేసులో చంద్రబాబుని ఏ-2గా చేర్చారు.
ఏ-1గా పీతల సుజాత, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలా వీరంతా వ్యవహరించారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇసుక అక్రమాల కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఏసీబీ న్యాయమూర్తికి అందించారు సీఐడి తరపు న్యాయవాదులు.
Also Read : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
మొత్తం 6 కేసులు నమోదు..
చంద్రబాబుపై తాజాగా ఇసుక కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో సీఐడీ, అంగళ్లు ఘర్షణపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మద్యం కేసు, ఇప్పుడు ఇసుక అక్రమాల కేసు నమోదైంది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. నాలుగు వారాల పాటు కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు స్కిల్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.
Also Read : బీహార్ లో దాణా కుంభకోణం.. ఏపీలో గేదెల స్కాం : నాదెండ్ల మనోహర్