Huzurabad By Poll : వీవీ ప్యాట్ బయటకు ఎలా వచ్చింది ? – డీకే అరుణ

పోలింగ్ ముగిసిన అనంతరం వీవీ ఫ్యాట్ లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కౌటింగ్ సమయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

Hzb

BJP Leader DK Aruna : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో…ప్రధాన పార్టీల మధ్య విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం వీవీ ఫ్యాట్ లు బయటకు ఎలా వచ్చాయనే అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తోంది. పూర్తి భద్రతతో అవి వెళ్లాలి కానీ…పోలీసులులు లేకుండానే..వాటిని ఎలా తీసుకెళుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు. ఎలాంటి భద్రత లేకుండా..అక్కడ బస్ లను ఎందుకు నిలిపివేశారని, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ రావడంతో…ఈవీఎం బాక్స్ లను మార్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Read More : MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

2021, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ను బీజేపీ నేతలు డీకే అరుణ, ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, దుగ్యాల ప్రదీప్ కుమార్ లు కలిసి వీవీ ఫ్యాట్ ల అంశంపై ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ లో జరిగిన పోలింగ్ పై చర్యలు తీసుకోవాలని, కౌటింగ్ సమయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. అనంతరం బుద్ధ భవన్ వద్ద డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన అనంతరం స్ట్రాంగ్ రూం నుంచి బయలుదేరిన బస్ లు మార్గమధ్యంలో ఓ టీఆర్ఎస్ నాయకుడి హోటల్ ఎదుట ఎలా ఆపుతారని, బస్ చెడిపోయిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్లు వీడియోలు చూడడం జరిగిందన్నారు.

Read More : Complaint On Etala : ఈటలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

ఈ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదని, ఓటర్లకు రూ. 75 కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. ఇన్ని సంవత్సరాల్లో దళితులకు ఏమి చేయని ప్రభుత్వం..ఉప ఎన్నిక రాగానే..దళిత బంధు పథకం తీసుకోచ్చిందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ పోలింగ్ ముందు మనిషికి 6,000 రూపాయలు…ఓటు వేసే రోజు మళ్ళీ 10,000 రూపాయలు పంచారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీబీఐ విచారణ చేపట్టాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కోరడం జరిగిందన్నారు.