రేస్ కోర్సా : లాక్ డౌన్ వేళ..నడిరోడ్డుపై BJP ఎమ్మెల్యే గుర్రపుస్వారి

  • Publish Date - May 12, 2020 / 09:45 AM IST

అసలే లాక్ డౌన్..నడి రోడ్డు..ఏవో కొన్ని కొన్ని వాహనాలు మాత్రమే వెళుతున్నాయి. ఒక్కసారిగా..ఠక్ ఠక్ ఠక్ అంటూ గుర్రం మీద హీరోలా దూసుకొస్తున్నాడు. దారి నుంచి వెళ్లే వారు ఒక్కసారిగా హతాశులయ్యారు. కనీసం మాస్క్ లేకుండా అంత స్పీడుగా పోవడం ఏంటీ ? ఇదేమన్నా..రేస్ కోర్సా అంటూ అనుకున్నారు. సినిమా షూటింగ్ లు ప్యాకప్ చేప్పేశాయి. మరి గుర్రం మీద పోయిన యువకుడు ఎవరు అని ఆరా తీశారు. ఇతను అధికార పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు అని తెలవడంతో నిర్ఘాంతపోయారు. 

లాక్ డౌన్ కొనసాగుతుండడంతో..కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. కర్నాటక రాష్ట్రంలో కూడా సీఎం బీఎస్ యడియూరప్ప వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని, బైక్ లు, కార్లుతో సంచరించవద్దని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే..రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ ఏం అనిపించిందో..ఏమో..గుర్రంపై తిరగాలని ఆశ పుట్టిందేమో..

అనుకున్నదే తడవుగా.. మైసూరు – ఊటీ జాతీయ రహదారిలోని గుండ్లుపేట ప్రభుత్వం ఐటీఐ కాలేజ్ సమీపంలో గుర్రంతో దౌడు తీశాడు. ముఖానికి మాస్క్ లేకుండానే దూసుకెళ్లాడు. కరోనా వైరస్ లెక్క చేయకుండా..అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా చేయడం విమర్శలకు దారి తీసింది. ఇతని మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

Read More : 

యాక్టర్ కాదు..సబ్ ఇన్‌స్పెక్టర్ : లాక్‌డౌన్ వేళ కార్లపై స్టంట్

వలస కార్మికులను కాలితో తన్నిన పోలీస్, లంచమిస్తేనే COVID 19 రిపోర్టులు