వలస కార్మికులను కాలితో తన్నిన పోలీస్, లంచమిస్తేనే COVID 19 రిపోర్టులు

ఇంటికి పంపించాల్సిందేనంటూ పట్టుబట్టిన ఇద్దరు వలస కార్మికులను బెంగళూరు పోలీస్ కాలితో తన్నాడు. ఈ ఘటన పై అధికారుల వరకూ చేరడంతో అతణ్ని వెంటనే సస్పెండ్ చేశారు. కేజీ హల్లీ పోలీస్ స్టేషన్ వద్ద కార్మికులంతా ఏకమయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని సొంత గ్రామాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేసేవరకూ తాము అక్కడి నుంచి కదిలేదనే వాదన వినిపించారు.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజా సాహెబ్ వారిని పంపించే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో ఆవేశంలో ఇద్దరిని చెంపదెబ్బలు వేసి.. కాలితో కొట్టాడు. సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ. అతను సస్పెండ్ అయ్యాడని చెప్పారు. ఏఎస్ఐని సస్పెండ్ చేశాం. అతనిపై డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ వేస్తున్నామని డా. ఎస్డీ శరణప్ప అనే సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు.
బెంగళూరు నుంచి 40కిలోమీటర్ల దూరం ఉన్న మాలూర్ జనరల్ హాస్పిటల్ మరో ఘటన జరిగింది. కొవిడ్ 19 అనుమానితులకు టెస్టు రిపోర్టులు కావాలంటే లంచ ఇవ్వాలంటూ జిల్లా హెల్త్ ఆఫీసర్ డిమాండ్ చేశాడని అతనికి నోటీసులు వెళ్లాయి.
కరోనా వైరస్ లాక్‌డౌన్ పుణ్యమా అని లక్షల కొద్దీ వలస కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉపాధి కోల్పోయారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం టిక్కెట్లు ఉంటేనే ప్రయాణమని చెపప్ింది. కొన్ని రాష్ట్రాలు బస్సులు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిస్తున్నా.. మరికొన్ని ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. నిత్యవసరాలు లేకపోయినా.. వేల మంది కాలిబాటనో, సైకిల్‌పైనో ఇళ్లకు వెళ్లే ప్రయాణాలు చేస్తున్నారు.
Read More :
* వలస కార్మికులపై దూసుకెళ్లిన కార్లు