ఓ వలస కూలీ దీన గాథ : రూ. 10 మిగిలాయి..ఇంటికి ఎలా వెళ్లాలి

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 02:11 AM IST
ఓ వలస కూలీ దీన గాథ : రూ. 10 మిగిలాయి..ఇంటికి ఎలా వెళ్లాలి

కరోనా వైరస్ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉపాధి కోల్పోవడంతో…దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికారణంగా కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది నడుచుకుంటూ వెళుతుంటే..మరికొందరు సైకిళ్లపై వెళుతున్నారు.

కానీ వీరు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తెచ్చుకున్న ఆహారం అయిపోయి..ఆకలతో అలమటిస్తున్నారు. చేతిలో డబ్బులు కూడా అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వలస కూలీ పడుతున్న బాధ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని..ప్రస్తుతం చేతిలో రూ. 10 మాత్రమే ఉన్నాయని..ఇంకా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని వాపోయాడు. 

బీహార్ రాష్ట్రమైన…శరన్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా..ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో..అతనికి ఉపాధి పోయింది. పని లేకపోవడంతో…సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆగ్రా వరకు 200 కిలోమీటర్ వరకు కాలినడకనే వెళ్లాడు.

ఇక్కడి నుంచి లక్నో వెళ్లేందుకు (సుమారు 350 కి.మీటర్లు)..తీసుకెళ్లేందుకు…ఓ ట్రక్ డ్రైవర్ సమ్మతించాడు. ట్రక్ డ్రైవర్ రూ. 400 తీసుకున్నాడని ప్రకాష్ వెల్లడించాడు. ప్రస్తుతం తన వద్ద కేవలం రూ. 10 మాత్రమే ఉన్నాయని..సొంతూరుకు ఎలా వెళ్లాలో తెలియడం లేదని కన్నీళ్లపర్యంతమయ్యాడు. లక్నో టోల్ ప్లాజా వద్ద ప్రకాష్ తో పాటు వేలాది మంది కార్మికులు అక్కడనే ఉండిపోయారు. ఒక్కొక్కరిది ఒక్క దీనగాథ. 

స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చేతిలో డబ్బులు లేక..తమ గమ్యాన్ని ఎలా ముగించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సాయం చేయాలని కోరుతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించింది కేంద్రం. 2020, మే 17వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.  మూడుసార్లు లాక్ డౌన్ ను కొనసాగించారు. కొన్నింటికీ కేంద్రం సడలింపులు ఇచ్చింది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 

Read More:

రైళ్లలో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలి : లవ్ అగర్వాల్

క్వారంటైన్‌ తప్పించుకోవటానికి రైలు నుంచి దూకేసిన వలస కూలీలు