గువ్వల బాలరాజు చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. ఏం జరుగుతోంది?

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుండే గ్యాప్‌ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రీకొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్‌ అప్పట్లో నడిచింది.

గువ్వల బాలరాజు చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. ఏం జరుగుతోంది?

Updated On : August 12, 2025 / 9:02 PM IST

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికపై తెలంగాణ బీజేపీలో డిఫరెంట్ ఒపీనియన్స్‌ వ్యక్తం అవుతున్నాయట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఆయన నల్లమల్లలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ఉద్యమం చేస్తానంటూ ప్రకటించారు. ఇదంతా బానే ఉన్నా గువ్వల బాలరాజు చేరికపై కమలం పార్టీలోనే అసంతృప్తులు మొదలయ్యాయట. ఆయన చేరికను కట్టర్ బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారట.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌పై పెద్ద ఎత్తున అలిగేషన్స్ రావడానికి గువ్వల బాలరాజే ప్రధాన కారణమని..అలాంటి నేతను ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారట బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌నే అవమానపరిచేలా గువ్వల చేసిన వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయట. నాగర్‌ కర్నూల్‌ బీజేపీ నేతలు కూడా గువ్వల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

Also Read: ఏజెన్సీ ప్రాంతాలపై కూటమి ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? కూటమి దృష్టంతా దీని మీదే ఉందా?

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుండే గ్యాప్‌ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రీకొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్‌ అప్పట్లో నడిచింది. వారిద్దరూ ఇప్పుడు గువ్వల జాయినింగ్‌ను అపోజ్ చేస్తున్నారట. భరత్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌కు టఫ్‌ ఫైట్ ఇచ్చిన ఆయన సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. . వచ్చే ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా లేకపోతే అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామనకుంటున్నారట భరత్‌. అందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట.

గువ్వల చేరికతో కొత్తగా ఒరిగేదేమి లేదంటూ..
ఈ క్రమంలో గువ్వలను చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఒకవైపు గతంలో పార్టీ జాతీయ నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరును క్యాడర్‌ గుర్తు చూస్తుంటే..స్థానిక నాయకత్వం గువ్వల రాకపై గుస్సా మీదుంది. దీంతో అసలు గువ్వల చేరికతో వచ్చే లాభమేంటి.? ఎంపీ ఎన్నికలప్పుడు ఆయన పార్టీలో లేకున్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చాం. అప్పుడే ఇంకాస్త కష్టపడితే గెలిచే వాళ్లం. ఇప్పుడు గువ్వల చేరికతో కొత్తగా ఒరిగేదేమి లేదంటూ పార్టీలో చర్చ జరుగుతోందట. మరోవైపు గువ్వలతో బిఆర్‌ ఎస్‌ శ్రేణులుకూడా ఎవరూ రాకపోవడంతో ఏక్‌ నిరంజన్‌ గువ్వలను చేర్చుకుంటే ఒరిగేదేమీలేదంటూ గొనుక్కుంటున్నారట బిజేపీ శ్రేణులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎన్నికైన తర్వాత చెప్పుకోదగ్గ జాయినింగ్‌గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంట్రీతో బీజేపీకి కలిసి వస్తుందని భావించారు. కానీ మొదటి ఆపరేషన్ ఆకర్ష్‌లోనే పార్టీలో ఇంటర్నల్‌గా పొలిటికల్ చర్చకు దారి తీసింది. పైగా గువ్వల జాయినింగ్‌లోనూ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా పెద్ద లీడర్లు ఎవరూ కనిపించలేదు. కండువా కప్పుకున్న తర్వాత కేంద్రమంత్రి బండిసంజయ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు గువ్వల. దీంతో రాష్ట్ర పార్టీ నేతల అసంతృప్తుల మధ్యే గువ్వల చేరిక జరిగిందని..కమలం పార్టీలో ఆయన ప్రయాణం కూడా అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది. గువ్వల రాకతో వచ్చిన అసంతృప్తికి అధినాయకత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.