Raja Singh: ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఫోన్ కాల్.. సెటైర్లు వేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

ఇప్పుడు కూడా నా పోరాటం ఆగదు, ఎవరికీ భయపడను. నాలాంటి ధర్మం గురించి పని చేసే చాలా మంది..

Raja Singh: ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫోన్ కాల్ వచ్చింది. మీకు సెక్యూరిటీ కావాలంటే లెటర్ పెట్టండి అని రాజాసింగ్ ను ఐబీ అధికారులు కోరారు. ఐబీ అధికారులకు రాజాసింగ్ సెటైర్లు వేశారట. గతంలో నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కు రిక్వెస్ట్ పెట్టుకున్నా.. నా విజ్ఞప్తిని కేంద్ర హోంశాఖ పట్టించుకోలదన్నారు రాజాసింగ్. అది దృష్టిలో పెట్టుకున్న రాజాసింగ్.. ఇవాళ కాల్ చేసిన ఐబీ అధికారులతో వెటకారంగా మాట్లాడినట్లు సమాచారం.

మీ సెక్యూరిటీ బిక్ష నాకు అవసరం లేదంటూ తిరస్కరించారట రాజాసింగ్. గతంలో హిట్ లిస్ట్ లో ఉంటేనే నేను సెక్యూరిటీ అడగలేదు. ఇప్పుడు ఎందుకు.. అని ప్రశ్నించారట. ”ధర్మం గురించి ఎప్పటి నుండో ఒంటరిగానే పోరాడుతున్నా. ఇప్పుడు కూడా నా పోరాటం ఆగదు, ఎవరికీ భయపడను. నాలాంటి ధర్మం గురించి పని చేసే చాలా మంది ఇవాళ హిట్ లిస్టులో ఉన్నారు. చాలా మందిని టెర్రరిస్టులు చంపేశారు. కనీసం బతికున్నోళ్లకైనా సెక్యూరిటీ ఇవ్వండి” అని అధికారులతో రాజాసింగ్ అన్నట్లు సమాచారం.

Also Read: ఎమ్మెల్సీ కవితతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టిన బీఆర్ఎస్..

కొన్ని రోజుల క్రితం రాజాసింగ్ కు ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరించిన ఉగ్రవాదిని ఇటీవల NIA పట్టుకుంది. రాజాసింగ్ కు ప్రాణహాని ఉందని తెలియడంతో ఐబీ అధికారులు ఆయనకు ఫోన్ చేసి సెక్యూరిటీ గురించి అడిగారు.