Bandi sanjay
Telangana BJP : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఆదివారం స్వేద పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు అద్భుత పాలన అందించామని, కాంగ్రెస్ మా పాలనపై బుదర జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తాజాగా స్వేద పత్రం విడుదలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ స్వేద పత్రం ఒక అబద్ధాల మూట అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని అన్నారు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని సంజయ్ అన్నారు. యాబై లక్షల కోట్ల సంపాదన ఎక్కడ పెట్టారు? ఫస్ట్ రోజున ఎందుకు జీతాలు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు, వేములవాడ దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని సంజయ్ అన్నారు.
Also Read : కాంగ్రెస్‌కు చుక్కలు చూపేలా స్కెచ్ వేసిన బీఆర్‌ఎస్ పార్టీ..
కాంగ్రెస్ కు సంజయ్ సూచన..
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్ లో చేరుతున్నాయని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయాలని సంజయ్ సూచించారు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయొద్దని బండి సంజయ్ సూచించారు. దరఖాస్తుల స్వీకరణ పార్టీలకు అతీతంగా ఉండాలని అన్నారు. బీజేపీ కార్యకర్తలు దరఖాస్తు స్వీకరణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. పది లక్షల మందికిపైగా రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన పేదలందరికీ యుద్ధప్రాతిపదికన రేషన్ కార్డులు ఇవ్వాలని సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
నిధులెలా ఇస్తారు?
తబ్లికి జమాత్ నిషేదిత సంస్థ. అదేమైనా ప్రజలకు ఉపయోగ పడే సంస్థనా? నిధులు ఎలా ఇస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. తబ్లికి జమాత్ తీవ్రవాదులు, ఉగ్రవాదులను తయారుచేసే సంస్థ. ఎందుకు నిషేధిత సంస్థని పెంచి పోషించాలని అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెనక్కి తీసుకోవాలని సంజయ్ కోరారు. గతంలో కొవిడ్ వ్యాప్తికి తబ్లికి జమాత్ సంస్థనే కారణం. ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను నిషేధించాయి. కొవిడ్ వ్యాప్తి జరుగుతుంది.. వెంటనే తబ్లికి జమాత్ సంస్థ దేశానికి రాకుండా చూడాలని అన్నారు.