Telangana elections 2023: నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరో తెలుసా?

మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ ఓ ప్రకటన చేసింది.

Telangana elections 2023 - BJP

Telangana elections 2023 – BJP: దేశంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ దీనిపైనే దృష్టి పెట్టాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఇవాళ తమ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌(Prakash Javadekar)ను నియమించింది.

అలాగే, సహ ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్ (Sunil Bansal)ను నియమించింది. అలాగే, మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ ఓ ప్రకటన చేసింది.

రాజస్థాన్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ను సహ ఇన్‌ఛార్జిగా బీజేపీ నియమించింది. అలాగే, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మథుర్ ను ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జిగా, మన్‌సుఖ్ మాండవీయను సహ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.

కేంద్ర మంత్రి భుపేంద్ర యాదవ్ ను మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జిగా, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను సహ ఇన్‌ఛార్జిగా నియమించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలకు వ్యూహాలు రచించుకున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల వేళ చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్షలు నిర్వహించుకున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే అనుసరించి మిగతా రాష్ట్రాల్లోనూ గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Minister KTR : తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు : మంత్రి కేటీఆర్