Minister KTR : తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు : మంత్రి కేటీఆర్
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

KTR , Modi
KTR Criticized Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ పుట్టుకను నరణరాన అవమానించిన వ్యక్తి నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. మోదీ.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో తమకు తెలియదన్నారు. రూ.25వేల కోట్లతో గుజరాత్ లో(కోచ్ ఫ్యాక్టరీ) అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని రూ.500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారని వెల్లడించారు.
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 9 ఏళ్ల తరువాత తూతూ మాత్రంగా వచ్చి తూత్ పాలిష్ పనులు చేస్తే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. సమాజంలో మోదీ మతం పేరుతో చిచ్చు పెట్టారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి.. మోదీని, బీజేపీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు.
గాంధీ భవన్ లో గాడ్సే దూరాడని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దగ్గర స్కామ్స్ పై సమాచారం ఉంటే ఫిర్యాదు చేయవచ్చు కదా అన్నారు.
ధరణిపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు.
గత మూడేళ్ళలో బీజేపీపై బీఆర్ఎస్ చేసిన దాడి కాంగ్రెస్ కనీసం 10శాతం చేసిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోదీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారని పేర్కొన్నారు. మోదీ దేశానికి చేసిన మేలెంటో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని లీడర్ గా ఎవరు గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏమిటని నిలదీశారు. మోదీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు.