BJP : పెద్దపల్లి అభ్యర్ధిని మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే?

గోమాస శ్రీనివాస్ యాక్టివ్ గా లేడని, క్యాడర్ ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానంకు రిపోర్ట్ వెళ్లింది.

Telangana BJP : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం.. తాజాగా పెద్దపల్లి బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్ ను హోల్డ్ లో పెట్టింది. ఆ నియోజకవర్గంలో శ్రీనివాస్ స్థానంలో మరొకరిని అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. గోమాస శ్రీనివాస్ యాక్టివ్ గా లేడని, క్యాడర్ ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానంకు రిపోర్ట్ వెళ్లింది.

Also Read : కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. అలాచేస్తే మూడునెలల్లో ముగ్గురు మాత్రమే మిగులుతరు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే ప్రచార సామాగ్రి చేరింది. పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థి ఫొటోలతో ప్రచార సామాగ్రి ప్రింటింగ్ అయినా అభ్యర్థికి బీజేపీ అధిష్టానం ఇవ్వలేదు. ఆయన ఫొటోలతో ప్రచారం చేయొద్దని జిల్లా క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, బీజేపీ పేరుమీద ఉన్న జెండాలతోనే ప్రచారం చేయాలని పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ ముఖ్యనేతలకు అదిష్టానం నుంచి సూచనలు వెళ్లినట్లు తెలిసింది.

Also Read : యూఏఈలో వరదలు.. నీట మునిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌

పెద్దపల్లి అభ్యర్థిని మారిస్తే అదే తరహాలో మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. పెద్దపల్లి అభ్యర్థి మార్పు విషయంపై చివరి వరకు సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు