Bandi Sanjay Letter To Cm Kcr (1)
Bandi Sanjay letter to CM KCR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో బండి సీఎం కేసీఆర్ కు పలు లేఖలు రాస్తున్నారు. పాదయాత్రలో ప్రజల నుంచి తమకు వచ్చిన సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కు బండి లేఖలు రాస్తున్నారు. ఈక్రమంలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్లీనరీలో సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.
Also read : TRS Plenary : కాసేపట్లో ప్రారంభం కానున్న టీఆర్ఎస్ ప్లీనరీ..
టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ అసమర్థ పాలనపై 1000 ప్రశ్నలు అడిగినా సరిపోవేమో అన్నారు. ఈ సందర్బంగా బండి ‘సీఎం కేసీఆర్ కు నిజం చెప్పకూడదనే శాపం ఏమన్నా ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు నిజాలు చెప్పరు అబద్దాలే చెబుతారు. అబద్దాలతో ప్రజలను మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. నిజం చెబితే ఏమన్నా అవుతందనే శాపం ఏమన్నా ఉందేమో అంటూ సందేహం వ్యక్తం చేసిన బండి సంజయ్ ప్రజల తరపున నేను లేఖ ద్వారా అడిగే ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా సీఎం కేసీఆర్ కు పలు లేఖలో సంధిస్తున్న బండి సంజయ్ తెలంగాణాలో ఉద్యోగాల భర్తీ గురించి కూడా పలు మార్లు ప్రస్తావించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాసినట్లు బండి సంజయ్ చెప్పారు.
Also read : TRS Plenary: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..
పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మిగతా పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేసి 45 రోజులు అవుతోందని, 16,614 పోలీసు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని ఆయన అన్నారు.