TRS Plenary: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..

టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...

TRS Plenary: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..

Trafic Restrictions

TRS Plenary : టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల మంది ప్రతినిధులు పాల్గోనున్నారు. ప్లీనరీ సందర్భంగా హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్ – ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ – కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని, ఈ సమయాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

TRS Plenary : టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!

ట్రాఫిక్ ఉండే ప్రాంతాలివే..
నీరూస్ జంక్షన్ – సైబర్ టవర్స్ జంక్షన్ – మెటల్ చార్మినార్ జంక్షన్ – గూగుల్ (సీఐఐ) జంక్షన్ – కొత్తగూడ జంక్షన్ రోడ్డు. అదేవిధంగా గచ్చిబౌలి జంక్షన్ – బోటానికల్ గార్డెన్ జంక్షన్ – కొత్తగూడ జంక్షన్ – కొండాపూర్ జంక్షన్లు. అదేవిధంగా మెటల్ చార్మినార్ జంక్షన్ – ఖానామెట్ జంక్షన్ – హైటెక్స్, హెచ్ఐసీసీ, ఎన్ఏసీ రోడ్డు. జేఎన్టీయూ – సైబర్ టవర్స్ – బయో డైవర్సిటీ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

TRS Plenary : నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. గులాబీ పండగకి సర్వం సిద్ధం

ప్రత్యామ్నాయ మార్గాలు..
నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు వెళ్లేవారు సీవోడీ (మాదాపూర్ అయ్యప్ప సొసైటీ) నుంచి దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి మీదుగా సైబర్ టవర్స్ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి. అదేవిధంగా మియాపూర్, కొత్తగూడ, హపీజ్ పేట్ ప్రాంతాల నుంచి వచ్చేవారు హైటెక్ సిటీ – సైబర్ టవర్స్ – జూబ్లీ హిల్స్ వచ్చే వాహనాలు రోల్లింగ్ హిల్స్ ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇనార్బిట్ – దుర్గం చెరువు రోడ్డులో ప్రయాణించాలి. అదేవిధంగా ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చేవాహనదారులు .. బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్ సీయు – ట్రిపుల్ ఐటీ – గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్, అల్విన్ రోడ్డు వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి.