TRS Plenary : నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. గులాబీ పండగకి సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.

TRS Plenary : నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. గులాబీ పండగకి సర్వం సిద్ధం

Trs Plenary

TRS Plenary : తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం ఇప్పటికే నగరం గులాబీమయంగా మారింది. గతేడాది అక్టోబర్‌లోనే టీఆర్ఎస్ ద్విదశాబ్ది వార్షికోత్సవ ప్లీనరీ ఏర్పాటు చేయగా.. తిరిగి ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీని టీఆర్ఎస్ నిర్వహించడం విశేషం.

TRS-PK : సీఎం కేసీఆర్ కు పీకే ఇచ్చిన రిపోర్టుతో గులాబీ నేతల్లో టెన్షన్..ఎవరిని ‘పీకే‘స్తారోనని

రాబోయే ఎన్నికలకు ఇప్పట్నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తంచేసి, వారిలో ఉత్తేజం నింపేలా పార్టీ అధిష్టానం ఘనంగా ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. కాగా.. కేవలం ఆహ్వానం అందిన వారు మాత్రమే హాజరు కావాలని అధిష్ఠానం పేర్కొన్నది. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులతో పాటు మండల, కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ప్లీనరీకి తరలిరానున్నారు.

TRS Formation Day Celebrations : టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. కమిటీలను ప్రకటించిన కేటీఆర్

ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మందికి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తుంది. ప్లీనరీకి హాజరయ్యే పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్టానం నిర్దేశించింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రసంగం ఉంటుంది.

TRS Plenary : పార్టీ పుట్టిన రోజు.. 21 ఏళ్ల సంబరాలు, కేటీఆర్ సమీక్ష

ప్రతిసారి ప్లీనరీలో తీర్మానాలకు ప్రాధాన్యం ఉండే సంగతి తెలిసిందే. కాగా, ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందులో తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు కూడా తెలుస్తుంది. వీటితో పాటు టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు, తదితర అంశాలపై తీర్మానాలుంటాయని సమాచారం.