TRS Formation Day Celebrations : టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. కమిటీలను ప్రకటించిన కేటీఆర్

టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై నేతల అభిప్రాయాలను..

TRS Formation Day Celebrations : టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. కమిటీలను ప్రకటించిన కేటీఆర్

Trs Formation Day Celebrations

TRS Formation Day Celebrations : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పలువురు నేతల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఆహ్వానితులు 27వ తేదీ 10 లోపు చేరుకోవాలని కేటీఆర్ సూచించారు. 11 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. టీఆర్ఎస్ 21 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఓ మైలురాయి అన్నారు కేటీఆర్. 11 నుంచి 11.30 గంటలలోపు అన్ని గ్రామాల్లో పతాక ఆవిష్కరణ చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలు దీనిపై దృష్టి సారించాలని కేటీఆర్ చెప్పారు.

తీర్మానాల కోసం ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేశామన్నారు. రంగారెడ్డి జిల్లా నేతల ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. హైటెక్స్ ప్రాంగణంలో అలంకరణ బాధ్యతలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు అప్పగించామన్నారు. ప్రతినిధుల నమోదుకు శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. వాహనాలు, పార్కింగ్ సౌకర్యం ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మాధవరం కృష్ణారావు సమక్షంలో భోజన ఏర్పాట్లు చేశామన్నారు. మీడియా కమిటీ భాను ప్రసాద్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ లు చూసుకుంటారని చెప్పారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నాం అన్నారు.(TRS Formation Day Celebrations)

హైదరాబాద్ నగరంలోని HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ప్లీనరీ సభ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలను కేటీఆర్ వేశారు. ఈ కమిటీలకు సంబంధించి ఆహ్వాన, అలంకరణ, సభా ప్రాంగణ, భోజన, తీర్మానాల, మీడియా కమిటీలను కేటీఆర్ ప్రకటించారు. మున్సిపల్, పోలీసు శాఖలతోనూ కేటీఆర్ సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రంజిత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, వివేక్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన తదితరులు పాల్గొన్నారు.

TRS Plenary : పార్టీ పుట్టిన రోజు.. 21 ఏళ్ల సంబరాలు, కేటీఆర్ సమీక్ష

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపైనా కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తన పాదయాత్రను పొరుగున ఉన్న కర్ణాటకలో చేయాలని, అందుకు అవసరమైతే వాహనాలు మేమే ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే కర్మ మాకు పట్టలేదన్నారు కేటీఆర్.

ప్లీనరీకి టీఆర్ఎస్‌ పార్టీ రెడీ అవుతోంది. 21 ఏళ్ల సంబరాలను ఘనంగా జరపుకునేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని HICCలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు.. తదితర అంశాలపై చర్చించారు.