TS BJP : నేడు జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు.. సద్దలోనిపల్లెలో నిరసన దీక్ష చేయనున్న బండి..

రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు...

Ts Bjp

TS BJP : రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రాల్లో బీజేపీ నేతలు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటన, రామాయంపేటలో ఘటనపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ నిరసన ర్యాలీలో బండి సంజయ్ పాల్గోనున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ గద్వాల జిల్లాలో రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సద్దలోనిపల్లిలోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఉదయం 9గంటల నుంచి 9.30 గంటల వరకు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

BJP Leaders: ఖమ్మం, రామాయంపేట్ సూసైడ్‌లపై కమలనాథుల సీరియస్

గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ ఈ మేరకు మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జిలకు, రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం టౌన్ లో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ తోపాటు కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్ వేధింపులకు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నరామక్రిష్ణ దంపతుల ఉదంతాన్ని సంజయ్ ఈ సందర్భంగా వివరించారు. దీంతోపాటు రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ సహా ఆ పార్టీ నేతల బెదిరింపులకు భయపడి సూసైడ్ చేసుకున్న గంగం సంతోష్, అతని తల్లి లాడ్జీలో ఉరేసుకుని చనిపోయిన అంశాన్ని ప్రస్తావించారు. అలాగే కూకుట్ పల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. చర్యలు తీసుకోకపోతే చావే శరణ్యమంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని బండి సంజయ్ వివరించారు.

Bandi Sanjay Yatra: తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే, కానీ రాజ్యమేలుతోంది పెద్దోళ్ళు: బండి సంజయ్

ఇలా టీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవటం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలను ఖండిస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అధికార పార్టీ ఆగడాలను వివరించడంతోపాటు బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యసహా టీఆర్ఎస్ నేతల దాష్టికాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర నేతలు బుధవారం గవర్నర్ తమిళసై ని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు.